Israel-Hamas: అమెరికా చెప్పింది.. యుద్ధం ఆపేస్తా..నెతన్యాహు

గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు.  యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు. 

New Update
trump-netanyahu

Trump-Netanyahu

ఈరోజు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump), ఇజ్రాయెల్(israel) ప్రధాని నెతన్యాహు(benjamin-netanyahu) సమావేశం అయ్యారు. ఇందులో హమాస్ తో యుద్ధంపై చర్చలు జరిగాయి.  వీటి తరువాత గాజాలో యుద్ధ ముగింపుకు అంగీకారం తెలుపుతున్నానని నెతన్యాహు ప్రకటించారు. అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతోందని ఆయన చెప్పారు. అయితే హమాస్ వీటికి ఒప్పుకుంటో లేదో అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

Also Read :  ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ప్రారంభించిన చైనా.. హైట్ తెలిస్తే షాక్!

హమాస్ కూడా ఒప్పుకోవాలి..

గాజా(Gaza) లో యుద్ధాన్ని ముగించడమే కాకుండా..పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని నెతన్యాహు కోరారు. అమెరికా చెప్పినవన్నీ ఒప్పుకుంటానని...కానీ హమాస్(hamas) నుంచి తమకు ఎటువంటి హానీ జరగకూడదని చెప్పారు.  ఒప్పందంలో భాగంగా మొదట గాజా నుంచి తమ సైన్యాన్ని దశల వారీగా వెనక్కు రప్పిస్తామని తెలిపారు.  అందుకు తగ్గట్టుగానే హమాస్ కూడా 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. అలాగే ఆ సంస్థ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. ఇవన్నీ అయిన తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలని నెతన్యాహు కోరారు. అది విజయవంతం అయితే కచ్చితంగా మొత్తం యుద్ధం ముగిస్తామని తెలిపారు.  అయితే గాజా నుంచి సైన్యం వచ్చేసినా...చుట్టుపక్కల మాత్రం ఉంటుందని..అది తమ సెక్యూరిటీ కోసమని చెప్పారు.  ఇప్పుడు అమెరికా రూపొందించిన శాంతి సూత్రాలను హమాస్ కూడా అంగీకరించాలని నెతన్యాహు కోరారు. అలా చేయకపోతే..దాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు. 

పశ్చిమాసియాలో శాంతి నెలకొనబోతోందని... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నమ్మకంగా చెప్పారు.  నెతన్యాహుతో సుదీర్ఘ చర్చలు జరిపామని చెప్పారు. ఖతార్ పై దాడి చేసినందుకు కూడా నెతన్యాహు క్షమాపణలు చెప్పారని తెలిపారు.  ఆ దేశంపై దాడులు చేసినందుకు ఇజ్రాయెల్ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్నందు వల్లనే నెతన్యాహు దిగి వచ్చారని తెలుస్తోంది. 

Also Read :  ముగ్గురు యువతులు హత్య.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..

Advertisment
తాజా కథనాలు