/rtv/media/media_files/2025/10/13/a-rare-honor-for-trump-israeli-knesset-standing-ovation-2025-10-13-17-36-28.jpg)
A rare honor for Trump.. Israeli Knesset standing ovation
Trump In Israel: ప్రపంచ దేశాలపై పలు రకాల పన్నులు విధిస్తూ అందోళనకు గురి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఇజ్రాయెల్ లో అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా ఉద్రిక్తతలకు కారణమైన ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆయనకు బెంజమిన్ నెతన్యాహు సర్కారు తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గౌరవించింది. ఈ సందర్భంగా ప్రపంచానికి ట్రంప్ లాంటి వారు మరింత మంది కావాలని సభ ఆకాంక్షించింది. వచ్చే ఏడాది ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని కూడా తెలపడం గమనార్హం.
కాగా ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్(hamas-israel-news)లో పర్యటిస్తోన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని నెతన్యాహు(benjamin-netanyahu)తో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ చట్ట సభ సభ్యులు అమెరికాఅధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పులు ఒప్పందం చేసినందుకు గానూ.. రెండున్నర నిమిషాలు పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.
Also Read : నేపాల్ జైలు నుంచి తప్పించుకుని భారత్ లోకి పాక్ మహిళ.. ఆమె లక్ష్యం ఏంటి?
A Rare Honor For Trump
ఈ సందర్భంగా చట్ట సభ స్పీకర్ స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ.. బందీల విడుదలకు కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను యూదు ప్రజలు వేల సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని కొనియాడారు. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్నంతగా ఎవరూ చేయడం లేదని చెప్పుకొచ్చారు. దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ట్రంప్ లాంటి నేతలు ప్రపంచానికి మరింతమంది కావాలని అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులైనవారు ఇంకెవరూ లేరని వెల్లడించారు. వచ్చే ఏడాది నోబెల్ పురస్కారం కోసం అన్ని దేశాలు ట్రంప్ పేరు ప్రతిపాదించేలా తాము కృషి చేస్తామని చట్టసభలో హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సైతం ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని ఇంత వేగంగా, దృఢనిశ్చయంతో కదిలించిన వ్యక్తి ట్రంప్ అని ఆయన లాంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదన్నారు. యుద్ధం ముగిసేలా గాజా ఒప్పందం చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి స్థాపన కోసం తామూ కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ కొంతసేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్‌నకు శాంతి సూచకమైన బంగారు పావురాన్ని బహుమతిగా అందజేశారు.
కాగా కాల్పుల ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న బందీలను ఈ రోజు (సోమవారం) విడిచిపెట్టింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ కూడా విడుదల చేసింది. ఇక, రెండో దశ కాల్పుల విరమణ చర్చల కోసం ఈజిప్టులో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకు నెతన్యాహుకు ఆహ్వానం లభించగా.. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఆయన హాజరుకావట్లేదు. ఈ చర్చల్లో ట్రంప్ మాత్రం పాల్గొననున్నారు.