Israel: ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది!
ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు.
ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు.
కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
2023 అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచనా తీరు కారణంగానే ఈ యుద్ధం ఆగడంలేదన్న అభిప్రాయాలను అమెరికా వ్యతిరేక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి!
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజామీద వాళ్ళ దళాలు విరుచుకుపడుతున్నాయి. కాల్పుల విరమణ చేసేది లేదని అంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హమాస్ ఉగ్రవాదులకు చనిపోవడం లేదా లొంగిపోవడమే మార్గమని అన్నారు.
ఏం జరిగినా...ఎవ్వరిడగినా...ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం చంపేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఇది ప్రమాదకరమైన సహకారమని అంసతృప్తి వ్యక్తం చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు.
ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్‌లు ఉన్నారు. హమాస్‌లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.
హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు.
యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు.