Trump Vs Nethanyahu: దోస్త్ కటీఫ్.. ఇజ్రాయిల్ ప్రధానిపై ట్రంప్ ఫైర్.. తిరగబడ్డ నేతన్యాహు?

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ దోహాపై ఇజ్రాయిల్ దాడిని తీవ్ర ఖండించారు. నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. అమెరికన్ మీడియాలో కథనాలు వెలవడుతున్నాయి.

New Update
12

ఇజ్రాయిల్, అమెరికాల స్నేహం చెదిరింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ దోహాపై ఇజ్రాయిల్ దాడిని తీవ్ర ఖండించారు. నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. అమెరికన్ మీడియాలో కథనాలు వెలవడుతున్నాయి. దాడి తర్వాత ట్రంప్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడితో ఇజ్రాయెల్ లేదా అమెరికా లక్ష్యాలు నెరవేరవని వైట్‌హౌస్ పేర్కొంది.

ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా ఇజ్రాయిల్‌కు హెచ్చరిక జారీ చేసింది. దాడికి ముందు తనకెందుకు సమాచారం ఇవ్వలేదని ట్రంప్ సీరియస్‌ అయ్యారు. ఖతార్‌లో అమెరికాకు అతిపెద్ద ఎయిర్‌ బేస్‌ ఉంది. ఖతార్‌తో అమెరికాకు బలమైన రక్షణ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దోహాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతుండగా, ఇజ్రాయెల్ హమాస్ నేతలపై దాడి చేసింది. ఈ దాడిలో హమాస్ సభ్యులతో పాటు ఒక ఖతార్ భద్రతా అధికారి కూడా మరణించారు. అమెరికాకు ఒక ముఖ్యమైన మిత్రదేశమైన ఖతార్ భూభాగంలో జరిగిన ఈ దాడి, మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు అడ్డుపడుతుందని వైట్‌హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు.

ఈ దాడి గురించి తనకు ముందుగా తెలియదని ట్రంప్ తన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. "ఇది నెతన్యాహు తీసుకున్న నిర్ణయం, నా నిర్ణయం కాదు" అని ట్రంప్ అన్నారు. ఈ దాడి గురించి తమ సైన్యం ద్వారా సమాచారం అందిన వెంటనే, తమ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌ను ఖతార్‌కు హెచ్చరించమని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ, ఆ సమాచారం వెళ్లేలోపే దాడి జరిగిందని ట్రంప్ వివరించారు.దోహా దాడి తర్వాత ట్రంప్, నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఖతార్ లాంటి దేశంలో దాడి చేయడం సరికాదని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. "ఇలాంటివి మళ్లీ జరగవని నేను దోహా ప్రధానికి హామీ ఇచ్చాను" అని ట్రంప్ తెలిపారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. తమపై దాడి చేసే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఏ దేశంపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలు మరోసారి అటకెక్కే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు