Gaza Peace plan: ఇది ఇజ్రాయెల్ నైతిక విజయం...బందీల విడుదలపై నెతన్యాహు ఎమోషనల్ పోస్ట్

ఇజ్రాయెల్ కు ఇది నైతిక, దౌత్య పరైన విజయం అంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం మొదటి దశపై సంతకాలు చేశాక ఆయన ఎమోషనల్ అవుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

New Update
trump-netanyahu

Trump-Netanyahu

గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం లో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచి పెడుతుంది. ఇజ్రాయెల్ గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అటూ ట్రంప్ పోస్ట్ లో రాశారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తామని...అరబ్‌, ముస్లిం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని చెప్పారు. ఈ మొత్తం జరగడానికి మాతో పాటూ కలిసి పని చేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ పోస్ట్ లో పెట్టారు.

ఫోన్ లో ట్రంప్ తో తన భావోద్వేగాన్ని పంచుకున్న నెతన్యాహు

అనంతరం దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఇ్రజ్రాయెల్ నైతిక, దౌత్యపరమైన విజయమంటూ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గాజాలో హమాస్ నిర్బంధించిన వారందరినీ ఇజ్రాయెల్ స్వదేశానికి తీసుకువస్తుందని అన్నారు. తాను మొదటి నుంచి చెప్పినట్లే చేశామని...బందీలను వెనక్కు తీసుకొచ్చే వరకు, తమ లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించము అని..అన్నట్టే చేశామని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ధృడ సంకల్నం, శక్తివంతమైన సైనిక చర్యలు...అమెరికా అధ్యక్షుడి ట్రంప్ గొప్ప ప్రయత్నాల వల్లనే ఇదంతా సాధ్యమైందని పోస్ట్ లో ఉటంకించారు. ప్రస్తుతం జరిగినది చాలా కీలకమైన మలుపని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ కు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని నెతన్యాహు రాశారు. దేవుడు అమెరికాను, ఇజ్రాయెల్ ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడని అన్నారు. 


నెతన్యాహు తన ఉద్వేగాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కూడా పంచుకున్నారని తెలుస్తోంది. నెతన్యాహు ఫోన్ కాల్ చేశారని ప్రీమియర్ కార్యాలయం తెలిపింది. దాంతో పాటూ తమ పార్లమెంటులో మాట్లాడడానికి ఆయన ట్రంప్ ను ఆహ్వానించారని చెప్పింది. బందీలందరినీ విడుదల చేయడానికి ఒప్పందంపై సంతకం చేయడంలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ, చాలా భావోద్వేగ, హృదయపూర్వక సంభాషణ చేశారని.. నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ కృషి, ప్రపంచ నాయకత్వాన్ని నెతన్యాహు..ప్రధాని దృఢమైన నాయకత్వం, ఆయన తీసుకున్న చర్యలను ట్రంప్ ప్రశంసించుకున్నారని చెప్పింది.  

Also Read: USA-India: భారత్ తో సంబంధాలు వెంటనే పునరుద్ధరించండి..ట్రంప్ సెనేట్ సభ్యుల లేఖ

Advertisment
తాజా కథనాలు