/rtv/media/media_files/2025/10/10/nobel-2025-10-10-06-00-27.jpg)
నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఈరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈ అవార్డ్ వస్తుందా రాదా అనే చర్చ తెగ జరుగుతోంది. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని...నోబెల్ శాంతి బహుమతికి తనకంటే అర్హుడు ఎవరూ ఉండరని ట్రంప్ చెబుతున్నారు. వైట్ మౌస్ లో అయితే ఆయనకు చోబెల్ కచ్చితంగా వస్తుందని బలంగా నమ్ముతున్నారు కూడా. ట్రంప్ ను ఈ అవార్డ్ కోసం పాకిస్తాన్, అజర్ బైజాన్, అర్మేనియా, కంబోడియా, ఇజ్రాయెల్ దేశాలు నామినేట్ చేశాయి. ఈ రోజు అంటే అక్టోబర్ 10న నోబెల్ పీస్ అవార్డ్ ప్రకటించనున్నారు. అందరూ దీన్ని ఎవరికి ఇస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ ను నోబెల్ జ్యూరీ కన్సిడర్ చేస్తుందా లేదా అని చర్చించుకుంటున్నారు.
ట్రంప్ కు అది ఇవ్వాల్సిందే..
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ విషయమై మరోసారి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని కచ్చితంగా ఇవ్వాలని ఆయన అంటున్నారు. దానికి ట్రంప్ అన్ని విధాలుగా అర్హుడని నెతన్యాహు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పోస్ట్ తో పాటూ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్టు...దానిని తానే ఆయన మెడలో వేస్తున్నట్టు నెతన్యాహు ఏఐ పిక్ పెట్టారు. కాసేపట్లో శాంతి బహుమతిని అనౌన్స్ ఉందనగా నెతన్యాహు ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Give @realDonaldTrump the Nobel Peace Prize - he deserves it! 🏅 pic.twitter.com/Hbuc7kmPt1
— Prime Minister of Israel (@IsraeliPM) October 9, 2025
మరోవైపు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందపై ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేండేళ్ళ యుద్ధానికి తెర పడినందుకు అందరూ సంతోషిస్తున్నారు. అయితే ఇదంతా ట్రంప్ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అంటున్నారు. చాలా రోజులుగా నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు చివరి ప్రయత్నంగా కరెక్ట్ గా బహుమతి ప్రకటనకు ఒకరోజ ముందు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం అయ్యేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇదొక రాజకీయ చిత్రమని చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య శాంతి ఒప్పందంలో మొత్తం అడుగు అడుగుక ట్రంప్ క్రెడిట్ పొందారు. అబ్రహం ఒప్పందాల నుంచి ఖైదీల మార్పిడి వరకూ అన్నీ తానే ముందుండి చూసుకున్నారు.
Follow Us