వాళ్ళని ఎలా కాపాడానంటే..!| Car Falls in a Canal at Tanuku, Youth Rescued Father and Daughter | RTV
Andhra Pradesh: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ?
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
Andhra Pradesh: GPS జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్
తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దీనిపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది.
Andhra Pradesh: జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు.. అరెస్ట్ తప్పదా?
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలతో బయటపెట్టింది. 2019 నుంచి 2024 వరకు అవినీతి, దోడిపిడి పాల్పడిన మాజీ సీఎం అరెస్టు అయ్యే అవశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతపత్రాలపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Andhra Pradesh: కేంద్ర పదవులు ఆశించడం లేదు.. జాతీయ మీడియాతో చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ఎజెండా లక్ష్యంగా ముందుకెళ్తు్న్నామని.. మాకు కేంద్రంలో పదవులపై ఆశ లేదని పేర్కొన్నారు.
Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.