Kotam Reddy Sridhar Reddy: నా హత్యకు కుట్ర.. కోటంరెడ్డి సంచలన ప్రెస్ మీట్!

తనపై తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి సంప్రదాయం తమ కుటుంబంలో లేదన్నారు. రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్లను చంపే రాజకీయం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు.

New Update
Kotam Reddy Sridhar Reddy

తన హత్యకు కుట్ర చేస్తున్నారని వస్తున్న వార్తలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(kotam-reddy-sridhar-reddy) స్పందించారు. ఈ రోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఒక వీడియో చూసి షాక్ అయ్యానని అన్నారు. హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూశానన్నారు. తనను చంపేయాలని రౌడీ షీటర్లు అందరూ మాట్లాడుకున్నారన్నారు. ఈ విషయం మూడు రోజుల ముందు నుంచే మా నోటీసులో ఉందని ఎస్పీ చెప్పారన్నారు. కానీ తనకు మాత్రం కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాగ్రత్త ఉండాలని కూడా అలర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లు తనను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారన్నారు. ఆ డబ్బు ఇచ్చేదెవరో పోలీసు విచారణలో తేలాలన్నారు. ఈ విషయంపై తాను ఎవరిపై ఆరోపణలు చేయలేదని.. ఎవరి గురించి మాట్లాడలేదని అన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వైసీపీ, వారి సోషల్ మీడియా, సాక్షి రోత పత్రిక తడుముకుంటోందని ఫైర్ అయ్యారు.

Also Read :  సంచలన సర్వే.. దేశంలో బెస్ట్ CM ఎవరో తెలుసా?

వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యతలను మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఇదంతా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ(ycp) ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. ఇలాంటి సంప్రదాయం తమ కుటుంబంలో లేదన్నారు. రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్లను చంపే రాజకీయం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు. తాను బెదిరింపులకి భయపడనన్నారు. వీఆర్ కాలేజీ నుంచే పోరాటాలు చేశానని.. విద్యార్థి నేతగా రౌడీలని తరిమిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తన చరిత్ర వైసీపీ నేతలకు బాగా తెలుసన్నారు. చాలా కాలం వాళ్లతో కలిసి పని చేశానని గుర్తు చేశారు.

25 ఏళ్లు రాజ్యం మాదే అని జగన్(YS Jgan) మాట్లాడుతున్న రోజుల్లోనే తాను వైసీపీని వీడి బయటకు వచ్చానన్నారు. అప్పుడు కూడా తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించారన్నారు. ఆ నాడే తాను లెక్కచేయలేదన్నారు. బండికి కట్టి తీసుకువెళ్లి లేపేస్తా అని ఒకడు అన్నాడని.. అప్పుడే తాను భయపడలేదని అన్నారు. కార్యకర్తల కోసం కొండలనైనా, బండలనైనా ఎదుర్కొనే నైజం తనదన్నారు. ఈ విషయాన్ని వైసీపీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

Also Read :  విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నా మనవడు కూడా భయపడడు..

ఇలాంటి బెదిరింపులకు తన 6 ఏళ్ల మనవడు కూడా భయపడడన్నారు. భయపడుతూ బతికే అలవాటు తమకు లేదన్నారు. హత్యకు కుట్ర వార్తలపై అభిమానులు భయాందోళనకు గురి కావొద్దన్నారు. వైసీపీ హయాంలోనే తనకు ఇద్దరు గన్ మెన్ లని తొలగించారని గుర్తు చేశారు. అప్పుడే మిగిలిన ఇద్దరిని కూడా వెనక్కి పంపించానన్నారు. గన్ మెన్లు లేని రోజుల్లోనే కార్యకర్తలు తనకు అండగా నిలిచారన్నారు. తాను కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. 

Advertisment
తాజా కథనాలు