Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.

New Update
cm and d cm

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు(hbd-pawan-kalyan) సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని తెలిపారు.  

Also Read :  BIG BREAKING: హరీశ్ రావుకు KTR సపోర్ట్.. వీడియోతో సంచలన ట్వీట్

నారా లోకేష్ విషెస్

అటు ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్‌, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" ఆని తెలిపారు. 

Also Read : Weather Update: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!

Also Read :  MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!

Advertisment
తాజా కథనాలు