Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర కుట్ర ...కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి ఆరిఫ్ ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.  ఇతను దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్నారు.

New Update
NIA

NIA

విజయనగరం(Vizianagaram), హైదరాబాద్‌(Hyderabad) కేంద్రాలుగా సాగిన ఉగ్ర కుట్ర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం హైదారాబాద్‌ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ బోయగూడలో నివాసం ఉండే సమీర్‌ అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలోకి పలువురిని సభ్యులుగా చేర్చుకున్నాడు. అలా మొత్తం ఆరుగురు సభ్యులతో తన కార్యకలపాలను విస్తరించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసులో ముఖ్య నిందితుడు సిరాజ్. ఇతను విజయనగరానికి చెందినవాడు. సిరాజ్‌ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎస్సై సెలక్షన్స్ కోసం హైదరాబాదులో శిక్షణ కోసం వచ్చాడు. రెండు సార్లు ఎస్సై కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇతనికి ఓ అజ్ఞాత వ్యక్తి సహకరించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఇప్పుడు అతనిని పట్టుకుంది. 

Also Read :  మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

ఢిల్లీలో కీలక నిందితుడు అరెస్ట్..

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో కీలక నిందితుడు ఎన్ఐఏ(NIA) కు పట్టుబడ్డాడు. బిహార్‌కు చెందిన అరీఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌ను ఎన్ఐఏ అధికారులు గురువారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇతను దేశంలోనే ఉంటూ జీహాదీ కార్యకలాపాలకు సిద్ధమైయ్యాడని విచారణలో తేలింది. అయితే నిన్న ఆరిఫ్ దేశం విడిచి పారిపోతుండగా అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు ఆరిఫ్ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఐఈడీలతో బాంబు పేలుళ్లకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా ఉగ్రవాదులు సమీర్, సిరాజ్‌లను ఈ ఏడాది మే నెలలో అరెస్ట్ చేసారు. పహల్గాం దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ ఉగ్ర దాడి బయటపడడం ఆందోళన రేకెత్తించింది. 

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సయ్యద్ సమీర్, సిరాజ్, పరహాన్ మొయినుద్దీన్, బాదర్, అద్నాన్ కురేసి, దిల్షాన్, మొహిషిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ లు నిందితులుగా ఉన్నారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై వీరంతా చర్చించేవారు.  వీరందరికీ సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ అనే వ్యక్తి ఉగ్ర సమాచారం ఇవ్వడంతో పాటు ఎక్కడెక్కడ కుట్రలు చేయాలి, ఎలా చేయాలనే అంశంపై సమాచారం అందించేవాడు. దీనికోసం ఎవరికీ అనుమానం రాకుండా సిగ్నల్‌ యాప్‌లో మాట్లాడుకునేవారు. అదే క్రమంలో బాంబులు తయారీ గురించి వారికి అవగాహన కల్పించాడు. ముసబ్‌ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించాడు సిరాజ్.  అలాగే సమీర్‌ అమేజాన్‌లో తెప్పించిన టిఫిన్‌ బాక్సులు, వైర్లు ఇతర వస్తువుల ద్వారా బాంబులు తయారు చేయడంతో పాటు విజయనగరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో ట్రయల్స్‌ కూడా చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక్కడ ఒక వర్గం కోసం పనిచేస్తున్నామని నిర్ణయించుకున్న సిరాజ్‌, సమీర్‌లు జిహాదీ కోసం ప్రాణత్యాగం కూడా చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. 

Also Read:Russia-Ukraine War: మొదటి సీ డ్రోన్ ప్రయోగించిన రష్యా..పేలిపోయిన ఉక్రెయిన్ అతిపెద్ద నౌక

Advertisment
తాజా కథనాలు