Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్

చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  చిత్తూరు జిల్లా పలమనేరులోని టి. వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల వద్ద  అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

New Update
recording dance

చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో(Vinayaka Chavithi Celebrations 2025) రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  చిత్తూరు జిల్లా పలమనేరులోని టి. వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల వద్ద  అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  దీంతో అనుమతి తీసుకోకుండా ఇలాంటి నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఆవడి నుండి ఐదుగురు మహిళా డ్యాన్సర్లను రప్పించి, వారి చేత అశ్లీల నృత్యాలు(Recording Dance) చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read :  నా హత్యకు కుట్ర.. కోటంరెడ్డి సంచలన ప్రెస్ మీట్!

డ్యాన్సర్లు  పోలీసులకు ఫిర్యాదు

ఈ నృత్యాలు యువకులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేయాలంటూ యువత పట్టుబట్టారు. అనంతరం, డ్యాన్సర్లకు చెల్లించాల్సిన రుసుముపై నిర్వాహకులు, డ్యాన్సర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో, ఈ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది. అయితే తమకు ఇవ్వాల్సిన డబ్బులు  ఇవ్వలేదని డ్యాన్సర్లు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఆర్గనైజర్ చరణ్, కొంతమంది పైన కేసు నమోదు చేశారు.  ఈ ఘటన భక్తుల ఆగ్రహానికి కారణమైంది. పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో ఇలాంటి అశ్లీల నృత్యాలు నిర్వహించడం పట్ల చాలా మంది తీవ్రంగా ఖండించారు.  వినాయక మండపాల వద్ద పర్మిషన్‌ లేకుండా ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Also Read :  తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు