/rtv/media/media_files/2025/09/06/ap-mystery-deaths-2025-09-06-13-03-43.jpg)
AP Mystery Deaths
గుంటూరు జిల్లా(Guntur District) గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం(Turakapalem) లో అంతుచిక్కని మరణాలు కలవరం రేపుతున్నాయి. గడచిన60 రోజుల్లో గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోయారు...? దీంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ గ్రామానికేమైంది...? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. అయితే ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అని కొందరంటున్నారు. కాదుకాదు దుష్టశక్తులని మరికొందరంటున్నారు. అయితే ఇవేం కాదు దానికి బ్యాక్టీరియాలే కారణమంటున్నారు వైద్యులు. అయితే ఇప్పుడవన్నీ ఉత్తవే అని తేలిపోయింది...! అసలు విషయం తెలిసి వైద్యులే తలలు పట్టుకుంటున్నారు... సైన్స్‌కే సవాల్ విసిరేలా వరుస మరణాల వెనుక మరో కారణం ఉన్నట్లు తేలింది. మరోవైపు ఈ విషయంపై సీఎం చంద్రబాబు సైతం సమీక్షించడం... పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పడంతో అసలేం జరగబోతోందన్నదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
గ్రామంలో అప్పటివరకు చలాకీగా ఉన్నవారు..ఒక్కసారిగా చతికలబడిపోవడం.. ఆనందంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే మట్టిమనుషులు… మాములు జ్వరాలకే చిక్కిచతికిలపడిపోతున్నారు. ఆస్పత్రుల పాలవుతున్నారు.. అక్కడ చికిత్స పొందుతూ అకాలంగా మరణిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారనుకున్నవారు శవమై తిరిగొస్తున్నారు..! ఒకవేళ దవాఖాన నుంచి క్షేమంగా ఇంటికి తిరికొచ్చినా… కొంతకాలానికే అనంత లోకాలకు వెళుతున్నారు. ఇదీ గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్థుల దుస్థితి. రెండు నెలలుగా కారణం తెలియకుండా 30 మంది మరణించడంతో గ్రామంలో భయం నెలకొంది. కాగా దీనిపై వైద్యులు పరీక్షలు నిర్వహించగా హెల్త్ రిపోర్టులు కూడా అన్ని నార్మల్‌గానే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటని ఎవరినీ అడిగినా అందరి చూపు బొడ్రాయి మీదనే ఉంటుంది. గ్రామానికి దక్షిణ దిక్కులో ప్రతిష్టించిన గౌటు రాయి కొద్దిగా పక్కకు ఒరగడంతోనే అరిష్టం జరుగుతోందని ఊరి పెద్దలు చెబుతున్నారు.
Also Read : ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..ఎందుకంటే?
Guntur Rare Disease
ఇదిలా ఉండగానే మరికొంతమంది మూఢనమ్మకాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. గ్రామానికి దుష్టశక్తులొచ్చాయ్… పొరమేరల్లో కాచుకుని కూర్చున్నాయని, సమయం చూసి కాటేస్తున్నాయని ప్రచారమూ చేయడంతో గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా పొయింది. దీన్ని నివారించాలంటే శాంతిపూజలు చేయాలని కొందరు… హోమం చేయాలని మరికొందరు… ఇలా ఎవరికి తోచింది వారు చెబుతూనే ఉన్నారు. దీంతో గ్రామమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భయంతో జనాలు బయటకు రాక ఆరుబయట మనిషి జాడ లేకుండా అయిపోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ల పనివాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లూ ఇళ్లూ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని అక్కడే ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయినా కారణం ఏంటీ అనే మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియానే కారణమని వైద్యాధికారులు చెప్పారు. కానీ, అదీ నిజం కాదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇలా వారంరోజులుగా నడుస్తున్న ఈ మిస్టరీకి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో తెరపడింది.
తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించడంతో పాటు రిపోర్టులన్నీ పరీక్షించారు… అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బొడ్రాయి కాదని,… మెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. గ్రామాన్ని పట్టిపీడిస్తున్నది బ్యాక్టిరీయా ఊరిని పీడిస్తోందని… అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలడానికి ఓ కారణమని ఆరోగ్యశాఖ మంత్రి తేల్చారు. కాగా, ఈ మిస్టరీ మరణాలను గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని సైతం నియమించారు.
ఇటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దని చెబుతూనే. ఇదేదో అరుదైన వ్యాధి అని తేల్చారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక వణికిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బొడ్రాయి కాదు… దుష్టశక్తులు లేవ్… త్వరలోనే మరణాలకు కారణాలేంటో తేలుస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!