/rtv/media/media_files/2025/09/05/chandra-grahan-2025-2025-09-05-15-09-50.jpg)
Chandra Grahan 2025
ఖగోళ సంఘటనలైన గ్రహణాలను చాలా మంది అరిష్టంగా భావిస్తారు. ఈ సమయంలో చాలా దేవాలయాలు(Temples) మూసివేయబడతాయి. అయితే.. కొన్ని అద్భుతమైన దేవాలయాలు ఈ ప్రభావం నుంచి మినహాయించబడ్డాయి. ఈ దేవాలయాలు తమ ప్రత్యేక నిర్మాణ శైలి. పురాణాల ప్రకారం.. గ్రహణాల శక్తిని తట్టుకునేలా రూపొందించబడ్డాయి. భక్తులు ఈ గ్రహణ సమయంలో కూడా ఇక్కడి దేవతలను పూజించేందుకు అనుమతించబడతారు. ఈ దేవాలయాల సంస్కృతి, వాటి ప్రాముఖ్యత, వాటి చారిత్రక ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ దేవాలయాల గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ప్రభావం లేని దేవాలయాలు:
సాధారణంగా గ్రహణ సమయంలో దేశంలోని అన్ని దేవాలయాలు మూసివేయడం ఆచారం. అయితే కొన్ని పురాతన ఆలయాలు మాత్రం ఈ నియమానికి అతీతంగా గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటాయి. వాటిలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఒకటి. దక్షిణ కైలాసంగా.. వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ఈ నెల 7న ఏర్పడనున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం(chandra grahan 2025) సందర్భంగా కూడా ఆలయం తెరిచే ఉంటుందని అధికారులు తెలిపారు. పురాణాల ప్రకారం.. శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు సూర్య, చంద్ర, అగ్ని, నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కూడిన కవచంతో దర్శనమిస్తాడు. దీనివల్ల రాహు, కేతువుల ప్రభావం ఈ ఆలయంపై ఉండదు.
ఇది కూడా చదవండి: 100 ఏళ్ల తర్వాత అరుదైన చంద్రగ్రహణం.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
ఈ ఆలయం రాహు-కేతు క్షేత్రం కావడంతో.. గ్రహణం రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. రాహు, కేతు, సర్ప దోషాల నివారణకు భక్తులు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. శ్రీకాళహస్తి ఆలయం(Srisailam Temple) తోపాటు బీహార్‌లోని గయలో ఉన్న విష్ణుపాద ఆలయం, రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళ ఆలయం కూడా సూతక కాలంలో తెరిచే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాలపై కూడా గ్రహణ ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేకమైన నమ్మకాల వల్ల ఈ ఆలయాలు గ్రహణ సమయంలో కూడా భక్తులకు దర్శనమిస్తాయని పండితులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:ఆదివారం నాడు చంద్రగ్రహణం.. ఈ 5 రాశుల వారికి డేంజర్!