/rtv/media/media_files/2025/08/21/chandrababu-2025-08-21-15-37-46.jpg)
Ap
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Charababu Naidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు, వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. Read More >> https://t.co/Um32PdRelq#AndhraPradesh#chandrababu#Politics#cabinetmeeting#RTV
— RTV (@RTVnewsnetwork) September 4, 2025
ఇది కూడా చూడండి: కవితను పట్టించుకోని కేటీఆర్.. రాజీనామా తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే!
గ్రామ, వార్డు, సచివాలయాల శాఖల కోసం..
ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో నామకరణాలు, వారి హోదాలలో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత రావచ్చని సమాచారం. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ వీటిపై చర్చించనుంది.
ఇది కూడా చూడండి: Vijayaramarao: కవితమ్మా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?.. నిప్పులు చెరిగిన విజయరామారావు!-VIDEO
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం నేడు లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రంగాలలో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు రాష్ట్రంలో అనధికారికంగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (BPS) గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై కూడా కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.