Ganesh Chathurthi 2025: ఏపీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి సర్కార్ శుభవార్త.. ఫ్రీగా ఆ సదుపాయం!

ఏపీ లో గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ  మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Ganesh Chaturthi 2025

Ganesh Chaturthi 2025

Ganesh Chathurthi 2025ఏపీ లో గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ  మండపాలకు ఉచిత విద్యుత్(free-electricity) ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.మంత్రి లోకేష్‌ చొరవతో ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో మండపాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. 

Also Read : Ganesh Chaturthi 2025: ఎల్లుండే వినాయక చవితి.. మీ ఇంట్లో ఈ 3 పనులు ఇప్పుడే ప్రారంభించండి!

కాగా ఈ విషయమై స్పందించిన లోకేష్‌(Nara Lokesh)  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ విషయమై సాధ్యసాధ్యాలపై వారితో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించాలంటే రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

Also Read: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

 రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా దేవి నవరాత్రి ఉత్సవ మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా తెలంగాణలోనూ గణేష్‌ మండపాలు, దుర్గాదేవి మండపాలకు సైతం ఉచిత విద్యుత్‌ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి:Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ

Advertisment
తాజా కథనాలు