/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ముఖ్యంగా నేడు, బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఏపీలో విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజల బయటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్పా అని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. వరద నీటిలో ప్రయాణించడం, విద్యుత్ తీగలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
HEAVY DOWNPOUR ALERT - PHASE 2 ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) September 2, 2025
For the next 3days, during Sep 2-4, there will be HEAVY DOWNPOURS in RED marked districts, MODERATE - HEAVY RAINS in BLUE marked districts, LIGHT - MODERATE RAINS ahead in GREEN marked districts
Hyderabad - LIGHT - MODERATE RAINS expected… pic.twitter.com/IbocTD25nO
తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణ(Telangana) లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీగా కురుస్తాయని, రెడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. జనగామ, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజుల కింద కామారెడ్డిలో భారీ వర్షాలు కురవడంతో జిల్లా మొత్తం నీటితో నిండిపోయింది. అత్యధిక వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పుడు కామారెడ్డిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు