Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మరణించిన విద్యార్థులను మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్ (23) గా గుర్తించారు. వారు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోడానికి వచ్చారని భారత కాన్సులేట్ వెల్లడించింది.
చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.
పాకిస్తాన్‌కు లోన్ ఇవ్వాలంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని IMF నింబందన పెట్టినట్లు సమాచారం. భారత్‌తో యుద్ధానికి దిగొద్దన్న షరతుపై పాకిస్తాన్‌కి రూ.8500 కోట్ల రుణం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. IMF పాకిస్తాన్‌కు శుక్రవారం లోన్ ఇచ్చింది.
భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపామని, ఒకవేళ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు చనిపోయేవారని తెలిపారు. ఇకపై ఇరు దేశాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
భారత్, పాక్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాహోర్‌పై దాడులు జరిగే అవకాశం ఉండటంతో తమ పౌరులు, రాయబారులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. స్థానిక అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని సూచించింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో పలువురు తీవ్రవాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ అంటోంది. అయితే పాక్ నోర్మూసుకుని కూర్చుంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సూచించారు
ఇండియా, పాక్ హై టెన్షన్ కారణంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామన్నారు.