అమెరికా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఇండియా, పాక్ హై టెన్షన్ కారణంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామన్నారు.

New Update
Rajnath Singh

ఇండియా, పాక్ ఉద్రిక్తతల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌తో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి పీట్ హెగ్సేత్‌ ఫోన్‌లో రాజ్ నాథ్ సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇండియా ఏ టైంలోనైనా సైనిక చర్యలు చేపట్టవచ్చని దాయాది దేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భారత్ ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటుంది. ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌తో మాట్లాడారు.

Also read: పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

ఇద్దరు నేతలు పహల్గాం ఉగ్రదాడి.. ఆ తర్వాత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇంతకు ముందు రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరిలో పీట్ హెగ్‌సెత్‌తో మాట్లాడారు. అమెరికా రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో అభినందలు తెలిపారు.

Also read: పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ.. వెంటాడుతున్న చావు భయం..!

అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఏడుగురు తాత్కాలిక సభ్యులతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతోనూ కీలక చర్చలు జరపారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను, వారికి సహాయం చేసినవారిని, కుట్రదారులను కఠినంగా శిక్షించడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఇరు దేశాల నాయకులు భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించగా.. పహల్గాం దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా నిలబడతామని రూబియో చెప్పారు. 

(us | america | US Defense Secretary | union-minister-rajnath-singh | attack in Pahalgam | action on pakistan | Jammu and Kashmir | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు