India Pak War : ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఇదే..!

పాకిస్తాన్‌కు లోన్ ఇవ్వాలంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని IMF నింబందన పెట్టినట్లు సమాచారం. భారత్‌తో యుద్ధానికి దిగొద్దన్న షరతుపై పాకిస్తాన్‌కి రూ.8500 కోట్ల రుణం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. IMF పాకిస్తాన్‌కు శుక్రవారం లోన్ ఇచ్చింది.

New Update
IMF loan

IMF loan

పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు దాదాపు యుద్ధానికి దారితీశాయి. ఇరు దేశాల పరప్పరం వైమానికి దాడులను తీవ్రతరం చేశాయి. కానీ. అమెరికా మధ్యలో కలుగజేసుకొని కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. పాకిస్తాన్ భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. మొదట యుద్ధం కోసం ఉవ్విళ్లూరిన పాక్‌ భారత్ దాడులను తిప్పికొట్టడం చూసి వెనుకడగు వేసింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్, క్షిపణ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి జరిపిన కాల్పులకు బిఎస్ఎఫ్ ధీటుగా సమాధానం చెప్పింది.

ఇండియాతో పాక్ యుద్ధానికి వెనక్కి తగ్గడంపై పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాలేక కొద్దిరోజుల క్రితమే ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్‌కి అప్పు కోసం వెళ్లింది. పాకిస్తాన్‌కు అప్పు మంజూరు చేయోద్దని భారత్ కోరింది. అయినా సరే IMF రూ.8500 కోట్ల రుణం ఇచ్చింది. భారత్‌తో యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని, కాల్పుల విరమణకు అంగీకరించాలని IMF పాకిస్తాన్‌కు నిబంధన పెట్టినట్లు సమాచారం. అయితే IMF అమెరికా అనుమతి లేనిదే పాకిస్తాన్‌కు లోన్ మంజూరు చేయదు. భారత్‌పై దాడుల విషయంలో అమెరికా పాక్‌కు ముట్టికాయలు వేసినట్లు సమాచారం. శనివారం పాకిస్తాన్, భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద చేసింది కూడా అమెరికానే.

(india pakistan ceasefire agreement | america | india | india pak war | latest-telugu-news | pakistan | air strike on pakistan | 2025 india pakistan war)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు