Operation Sindoor :  పాక్ నోర్మూసుకుని కూర్చో.. అమెరికా మంత్రి హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్‌ చేపట్టిన సైనిక చర్యలో పలువురు తీవ్రవాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్‌ అంటోంది. అయితే పాక్‌ నోర్మూసుకుని కూర్చుంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో సూచించారు

New Update

 Operation Sindoor :  పాక్ నోర్మూసుకుని కూర్చో.. అమెరికా మంత్రి హెచ్చరిక

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో  'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్‌ చేపట్టిన సైనిక చర్యలో పలువురు తీవ్రవాదులు హతమయ్యారు. అయితే తమ పౌరులపై దాడి జరిగిందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్‌ ప్రగల్భాలు పలుకుతోంది. అయితే పాక్‌ నోర్మూసుకుని కూర్చుంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో సూచించారు.

 
పహల్గాం ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలను తీసుకున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి గుణపాఠం చెప్పింది. పాక్‌, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం తెల్లవారు జామున మెరుపుదాడి చేసి 90 మంది వరకు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ఈ దాడి జరిగగా దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో తిష్టవేసుకున్న ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి.   అయితే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్‌ ప్రగల్భాలు పలుకుతోంది.

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న సరదాగా గడిపేందుకు వెళ్లిన పర్యాటకులపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు.  దీంతో దేశమంతా ఆగ్రహంతో ఊగిపోయింది. పాక్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే భారత్‌ ఆఫరేషన్‌ సింధూర్‌ పేరుతో  ఉగ్ర నిర్మూలన చర్యలు చేపట్టింది. ఈ దాడితో దేశం యావత్తు సంబురాలు చేసుకుంటోంది.  


భారత్ దాడికి సమాధానం చెబుతాం.. పాక్ మంత్రి ప్రగల్భాలు


పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్యలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. అయితే, పాక్ మాత్రం తమ పౌరులపై దాడి జరిగిందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని బీరాలు పలుకుతోంది. భారత్‌కు సమాధానం చెబుతామని పాక్ సమాచార ప్రసార మంత్రి అహుతుల్లా తరార్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

పాక్ నోర్మూసుకుని కూర్చో.. అమెరికా మంత్రి


కాగా ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్ సైన్యం పాకిస్థాన్‌పై దాడి చేయడంతో ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రగల్భాలు పలుకుతుంది. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో స్పందించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.

ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కు ఉందని, ఆపరేషన్‌ సింధూర్‌ పై పాకిస్థాన్‌ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ మార్కో రూబియో హితవు పలికారు. భారత్‌ యాక్షన్‌కు  కౌంటర్‌గా పాక్‌ ఎలాంటి చర్య తీసుకోవద్ధని, ఇండియాపై యుద్ధానికి ధైర్యం చేయొద్దని సూచించారు. పాక్‌ జాతీయ భద్రతా సలహాదారుతో మాట్లాడిన రాబియో క్వీప్‌ క్వైట్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

మురీద్‌కేలో 40 వరకు ఉగ్రవాదులు హతం


 కాగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలు కేంద్రంగా భారత్‌ జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌లో లష్కరే తొయిబా ప్రధాన స్థావరం ధ్వంసమైంది. లష్కరే స్థావరం మురీద్‌కేపై భారత్ సైన్యం మెరుపు దాడి చేయడంతో  దాదాపు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు