/rtv/media/media_files/2025/05/13/hGIOBN43g7WMPj3Ona10.jpg)
us-accident
న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ సంఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది. మరణించిన విద్యార్థులను మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్ (23) గా గుర్తించారు. మే 10న పెన్సిల్వేనియాలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు వెళ్తున్న కారు వంతెనను ఢీకొట్టడంతో ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడగా, అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారని తెలిపారు.
Also read : BIG BREAKING: ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్ట్!
Also read : BIG BREAKING: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!
ఉదయం 7 గంటల ప్రాంతంలో
Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;
— India in New York (@IndiainNewYork) May 12, 2025
Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోడానికి వచ్చారని వెల్లడించింది. మృతుల కుటుంబాలతో కాన్సులేట్ సంప్రదింపులు జరుపుతున్నామని.. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
Also read : Pawan Kalyan - OG Update: ‘ఓజి’ సెట్‌లో పవన్ కళ్యాణ్!.. ఈసారి ముగిద్దాం అంటూ పోస్ట్
Also read : Today Gold Rates: వెంటనే కొనేయండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు - ప్రాంతాల వైజ్ లిస్ట్