Indian Student Bahamas: బహమాస్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు భారత సంతతి విద్యార్థి దుర్మరణం

భారత సంతతికి చెందిన గౌరవ్ జైసింగ్ ప్రమాదవశాత్తు బహమాస్‌లో మృతి చెందాడు. మరో వారం రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కానుండగా.. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌ బాల్కనీలో తిరుగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు.

New Update
annamaianh crime news

crime news

Indian Student Bahamas: అమెరికాలో(America) ఉంటున్న భారత సంతతికి చెందిన గౌరవ్ జైసింగ్(Gaurav Jaisingh) బహమాస్‌లో మృతి చెందాడు. ప్రమాదవశాత్తు హోటల్ బాల్కనీ నుంచి పడిపోవడంతో మృతి(Tragic Accident) చెందాడు. మసాచు సెట్స్‌లోని వాల్తామ్‌లోని బెంట్లీ విశ్వవిద్యాలయంలో గౌరవ్ జైసింగ్ చదువుతున్నాడు. ఇంకో వారం రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కానుంది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్లాడు. బాల్కనీలో సాయంత్రం సమయంలో తిరుగుతుండగా పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే జైసింగ్ మరణంపై దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి:Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్‌ రెడ్డికి నో బెయిల్‌

Advertisment
తాజా కథనాలు