మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీని ప్రకారం జూలై 10 నుంచి జూలై 14 వరకు కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేశారు.
11 కోట్ల విలువైన 13.24 కిలోల బంగారం, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. 45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ప్రయాణికుల బట్టల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఏడుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. గత 4 రోజుల్లో మొత్తం రూ.11 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీలు పట్టుబడ్డాయి. ఈ విధంగా వారు చెప్పారు.
Mumbai
Hi -Tech robbery: దర్జాగా విమానంలో వెళ్లి.. ఘరానాగా దోపీడీ చేసి.. ఈ దొంగల రూటే వేరు!
Hi -Tech robbery: ఉద్యోగం కోసం ట్రైన్ లో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. హైదరాబద్ లో ఉద్యోగం.. కాజీపేట నుంచి రోజూ వచ్చి వెళ్లడం లేదా హైదరాబాద్ నుంచి శివారు ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిరావడం మనందరికీ తెలిసిందే. ఇక బిజీగా ఉండే బిజినెస్ బాబులు.. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో కీలక బాధ్యతల్లో ఉన్న వారు.. ఉద్యోగ పనుల నిమిత్తం వారంలో ఒకటి రెండు సార్లు విమానంలో హైదరాబాద్ నుంచి ముంబయి.. ఢిల్లీ వంటి ప్రాంతాలకు నిత్యం పరుగులు తీయడమూ అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ ఈ దొంగ బాబులు మాత్రం వారానికోరోజు తెల్లవారకుండా విమానం ఎక్కి 1500 కిలోమీటర్లు వెళ్లి.. అక్కడ తమ పని కానిచ్చి.. సాయంత్రం డిన్నర్ టైమ్ కి మళ్ళీ విమానంలో ఇంటికి చేరిపోతున్నారు. ఈ అతి తెలివైన దొంగల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఆ విశేషాలు మీకోసమే..
Hi -Tech robbery: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ముంబయికి వారానికి ఒకసారి 1500 కిలోమీటర్లు ప్రయాణించే దొంగల ముఠా గుట్టు రట్టయింది. వీరు ముంబయిలో మహిళలను దోచుకునేవారు. తర్వాత దోచుకున్న వస్తువులతో విమానంలో ఢిల్లీకి వచ్చేవారు. ఆ తరువాత అక్కడి నుంచి మీరట్‌కి తిరిగి కారులో చేరుకునేవారు. అయితే ఎంత తెలివైన దొంగ అనుకున్నా ఏదో ఒకరోజు కచ్చితంగా పట్టుబడతాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
Hi -Tech robbery: ఈ ముఠా మీరట్‌కు 1500 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర రాజధాని ముంబైలో దొంగతనాలకు పాల్పడేది. ఈ ముఠా విశేషమేమిటంటే.. తెల్లవారుజామున ఫ్లైట్‌లో అక్కడికి వెళ్లి అక్కడ దోపిడి చేసేవారు. సాయంత్రం తిరిగి విమానంలో వచ్చేవారు. ఇటీవల, ముంబైలోని మాతుంగా పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులో మహిళతో మాటలు కలిపి దోపిడీకి పాల్పడిన సంఘటన జరిగింది. దుండగులు మహిళను కాఫీ తాగించి అపస్మారక స్థితికి చేర్చి బంగారు గొలుసు, ఇతర వస్తువులను దోచుకెళ్లి పారిపోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
పోలీసుల విచారణలో షాకింగ్..
Hi -Tech robbery: మాతుంగ పోలీసులు విచారణ ప్రారంభించగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుండగులు ఒకే ముఠాకు చెందిన వారని తేలింది. వీరు వారానికి ఒక్కసారే దోపిడీకి పాల్పడుతున్నారు. దీని కోసం వీరు మీరట్ నుండి ముంబైకి వచ్చి అదే రోజు సాయంత్రం తిరిగి మీరట్ చేరిపోతారు. వారిని ఒకరోజు ముంబయి వెళ్లి అక్కడ దర్జాగా దొంగతనం ముగించి.. ఆనక ఢిల్లీకి విమానంలో వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడి నుంచి కారులో మీరట్‌కి తిరిగి వస్తారు. ముంబయిలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆ సమయంలో నిందితుడి ఆచూకీని కనిపెట్టి మీరట్‌లోని కొత్వాలి ప్రాంతంలో దాడి చేశారు. అక్కడ ముంబై పోలీసులు మీరట్‌లోని షహనత్తన్‌కు చెందిన యూనస్ అనే నేరస్థుడిని పట్టుకున్నారు. ఆ తరువాత అతను ఇచ్చిన ఈ విమాన ప్రయాణ సమాచారం విని అవాక్కయ్యారు పోలీసులు. తరువాత మరో నిందితుడి కోసం బ్రహ్మపురిపై దాడి చేశి అక్కడ పట్టుకున్నారు.
ఈ దుర్మార్గులిద్దరూ చాలా కాలంగా నేరాలకు పాల్పడుతున్నారని మాతుంగ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఎస్ఐ సంతోష్ మాలిక్ మీడియాకు తెలిపారు. వీరి గ్యాంగ్‌లో చాలా మంది వ్యక్తులు ఉన్నారనీ.. వారి గురించి కూడా వెతుకులాట మొదలు పెట్టమని ఆయన వివరించారు.
VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్లోనే!
VandeBharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది. ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ – ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు ఈ విషయం గురించి తాజాగా తెలియజేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మరోవైపు సికింద్రాబాద్ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (చైర్ కార్) రానున్నట్టు మరో సమాచారం.
Also read: రైల్వే శాఖ కీలక నిర్ణయం…ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
Ambani’s Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు..
Ananth Ambani-Radhika Merchant: అంబానీల ఇంట పెళ్ళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో వేడుకతో ముంబయ్ మారు మోగిపోతోంది. మరో రెండు రోజుల్లో పెళ్ళి జరగనుంది. దీని సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటూ జరగనున్న అనంత్-రాధికల పెళ్ళికి అంబానీ కుటుంబం భారీగా ఏర్పాట్లు చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్ లో శుక్రవారం (జూలై 12) వివాహం జరగనుంది. దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు, వీవీఐపీ అతిధులు రానున్నారు.
అనంత్ అంబానీ-రాధికా పెళ్ళి వేడుకలు మార్చ నుంచి మొదలయ్యాయి. ఎంగేజ్ మెంట్, ప్రీ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్-2, సంగీత్, హల్దీ…ఇలా కొనసాగుతూ వస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో అనంత్ అం బానీ, రాధిక మర్చంట్ వివాహం జరిపేందుకు ముఖేష్ అంబానీ దంపతులు అత్యంత భారీ ఏర్పాట్లు చేశారు. పెళ్ళికి వచ్చే గెస్ట్‌ల కోసం మూడు పాల్కన్ 2000 జెట్ లు, 100కు పైగా విమానాలను రెంట్ కు తీసుకున్నారు.
ప్రత్యేక వంటకాలు…ప్రత్యేక రుచులు
ప్రీ వెడ్డింగ్‌కు అంబానీ ఫ్యామిలీ ఇచ్చిన విందు సూపర్ వైరల్ అయింది. ఇప్పుడు అంతకంటే విభిన్నంగా..మరిన్ని ఎక్కువ వంటకాలతో పెళ్ళి విందుకు రెడీ అయ్యారు ముఖేష్, నీతా అంబానీలు. వారణాసిలో ప్రసిద్ధిచెందిన కాశీ ఛాట్ భండార్ వ్యాపారులు వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. వీటిని కాశీ ఛాట్ బండార్ ఓనరే స్వయంగా అతిధులకు వడ్డించనున్నారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో 2వేల 5 వందల రకాల రుచులతో భోజనాలు పెట్టిన అంబానీ ఫ్యామిలీ.. ఇప్పుడు పెళ్ళిలో 3 వేల ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మొత్తం పెళ్ళి ఖర్చు విషయానికి వస్తే…ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 1260 కోట్లు ఖర్చు చేశారని అంచనా.. పెళ్లి జరిగే నాటికి ఓ 15 వందల కోట్లు ఖర్చు పెట్టనుందని అంచనా. అంతు ముందు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్ళికి 700 కోట్లు ఖర్చుపెట్టారు.
Mumbai: యాక్సిడెంట్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్‌కు 40సార్లు ఫోన్..ముంబయ్ హిట్ అండ్ రన్ కేసు
యాక్సిడెంట్ చేయడమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు ముంబయ్‌లో ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్. ఇంట్లోనే మూడు రోజుల పాటూ దాక్కున్నాడు. దీనికి అతని కుటుంబం మొత్తం సహకరించింది. ఈ కారణంగానే రాజేష్ షా, అతని భార్య, కూతురులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ సమయంలో మిహిర్‌తో పాటూ ఉన్న అతని డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మిహిర్ గర్ల్ ఫ్రెండ్ ను కూడా కస్టడీలో తీసుకుని విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మిహిర్ యాక్సిడెంట్ చేశాక కారును బాంద్రాలోని కాలా నగర్లో వదిలేసి, గోరెగావ్‌లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రెండు గంటలు ఉన్నాడు. ఆమెకు మొత్తం విషయం చెప్పాడు. దాంతో గర్ల్ ఫ్రెండ్ మిహిర్ సోదరికి కారు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. అప్పుడు ఆమె వచ్చి అన్నను ఇంటికి తీసుకు వెళ్ళింది. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి షాపుర్‌లోని రిసార్టుకు వెళ్లిపోయారు. అది ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత స్నేహితుడితో పాటు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడే అతడి స్నేహితుడు 15 నిమిషాల పాటు ఫోన్ ఆన్ చేయడంతో లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు మిహిర్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు మిహిర్ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా కస్టడీలోకి తీసుకునే యోచనలో ఉన్నారు ముంబయ్ పోలీసులు.
ఆదివారం తెల్లవారు ఝామున ముంబయ్‌లోని వర్లి ప్రాంతంలో మద్యం మత్తులో మిహిర్ స్కూటర్ మీద వస్తున్న ఓ జంటను గుద్దేశాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళి పడ్డారు. దాంతో కింద పడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందగా…ఆమె భర్త గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read:Jammu-Kashmir: కఠువాలో ఎన్ కౌంటర్.. 2గంటలు, 5189 రౌండ్ల కాల్పులు
Mumbai: ఆకాశాన్నంటుతున్న ముంబైలో స్టార్ హోటళ్ళ ధరలు..అనంత్ అంబానీ పెళ్ళే కారణం
Ananth Ambani Wedding: ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి అత్యంత జరుగుతోంది. ప్రతీ చిన్న వేడుకను గ్రాండ్ గా చేస్తున్నారు అంబానీ దంపతులు. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లో ఒక్కటవ్వబోతున్నారు. ముంబై జియో కన్వెన్షన్‌లో ఈ వివాహం జరగబోతోంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా సినీ, రాజకీయ, వీవీఐపీలు రానున్నారు. దీని కోసం ముంబైలో స్టార్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని హోటల్ యజమానులు కూడా రేట్లను అమాంతంగా పెంచేస్తున్నారు. ఒక్క రాత్రి స్టేకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ట్రైడెంట్, ఒబెరాయ్ హోటళ్ల్ళల్లో జులై 10 నుంచి 14 వరకు గదులు ఖాళీగా లేవు. వీటితో పాటూ ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. QGతకు ముందు ఒక్కరాత్రి బస చేసేందుకు రూ.13 వేల నుంచి రూ.30 వేలుగా ఉండగా.. జులై 14న రూ.40 వేలు చూపిస్తోంది. మరో హోటల్లో 14న ఏకంగా రూ.90వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. పన్నులు కలిపి ఇది మరింత పెరుగుతుంది. జులై 10, 11 తేదీల్లో మాత్రం ఖాళీగా లేవు.
అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ పెళ్ళి జూలై12న జరగనుంది. దాని తరువాత కూడా పలు కార్యక్రమాలు నిర్వహించున్నారు. జూలై 14వరకు ఇవి జరగనున్నాయి. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న మంగళ్ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జులై 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.