/rtv/media/media_files/2025/05/20/4nq4tl2a1vj9gppVbWIT.jpg)
Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు సినిమాలకు దూరం అయ్యాడు. అయితే అంతకు ముందు ప్లానింగ్‌లో ఉన్న సినిమాలు మాత్రం పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హరిహర వీరమల్లు పేరుతో రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది.
నార్త్ లో చాలా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు🔥🔥🔥 పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్య అతిథిగా మరొక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి వచ్చేలా ప్లానింగ్💥👍🏻 #HariHaraVeeraMallu #HHVM pic.twitter.com/x6IYObr13d
— Narendra News (@Narendra4News) May 20, 2025
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
కాగా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం చిత్రబృందం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. నిర్మాత ఏఎమ్ రత్నం ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకి వచ్చాడని సినీవర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా నార్త్‌లో భారీ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ముంబై వేదికగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి బాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ గెస్ట్ ఇన్వైట్ చేయాలని భావిస్తున్నారట.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
ఇటీవల చిరంజీవి బాలివుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరిహరవీరమల్లుకోసం ఆయనను గెస్ట్‌గా అనుకుంటున్నారట. ఆ బాధ్యతను నిర్మాతలు ఇప్పటికే రామ్ చరణ్‌కు, చిరంజీవికి అప్పగించారనే టాక్ వినపడుతోంది. బాలీవుడ్ స్థాయిలో పవన్ తొలి సినిమా కావడంతో సల్మాన్ వస్తే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని తద్వారా హిట్ సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
గత పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. కానీ రాజకీయాల్లోనూ రాణించకపోవడంతో మళ్లీ సినిమాలు చేశాడు. అలా వరుసగా వకీల్ సాబ్, బీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్స్ సినిమాలు చేశారు. కానీ అవి అంతగా ఆడలేదు. అయితే తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు పాటలు, టీజర్, ఫొటోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..