Heavy Rain Alert: మునిగిపోయిన మెట్రో స్టేషన్.. వీడియోలు చూస్తే గజగజ వణకాల్సిందే

భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్ నీట మునిగింది. ట్రైన్‌ ట్రాక్‌లపై మాత్రమే కాకుండా ట్రైన్‌ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరింది. అలాగే ప్లాట్‌ఫామ్‌లపై భారీగా నీరు చేరడంతో మెట్రో స్టేషన్ చెరువును తలపించింది.

New Update
Mumbai metro station flooded as water gushes inside amid heavy rain

Mumbai metro station flooded as water gushes inside amid heavy rain

దేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విపరీతమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇలా కుండపోత వర్షాల కారణంగా ఏకంగా మెట్రో స్టేషన్‌ మునిగిపోయింది. అవును మీరు విన్నది నిజమే. ముంబైలో భారీ వర్షం దంచికొడుతోంది. దీని కారణంగా దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలమైంది. 

Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

మునిగిన మెట్రో స్టేషన్

ప్రస్తుతం ముంబై నగరం రెడ్ అలెర్ట్‌లో ఉంది. కుండపోత వానకు వాతావరణ శాఖ నగరం మొత్త రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో నగరం నరకంలా మారిపోయింది. కరెంట్ నిలిచిపోయింది.. రవాణా వ్యవస్థ ఆగిపోయింది. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. దీంతో ప్రజల పరిస్థితి అధ్వనంగా మారింది. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

అంతేకాకుండా రైల్వే ట్రాక్‌లపైకి వర్షం నీరు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో రైల్వే సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది. ఇక ముంబైలోని వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది. ఈ మెట్రో సేవలు మే 10న ప్రారంభమయ్యాయి. మూడు లైన్ల అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌ను బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ నుంచి వర్లిలోని ఆచార్య అత్రేచౌక వరకు ఈ మెట్రో నడుస్తుంది. 

ఇటీవలే ప్రారంభమైన ఈ అండర్‌గ్రౌండ్ మెట్రోకు ఇప్పుడు అంతరాయం ఏర్పడింది. ఏకంగా మెట్రో లోపలికి భారీగా నీరు వచ్చి చేరింది.  మెట్రో స్టేషన్ ప్రారంభం నుండి లోపలకి వెళ్లే వరకు వర్షపు నీరు చెరును తలపించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆఖరికి ప్లాట్ ఫామ్‌లు కూడా వర్షపు నీరుతో మునిగిపోయింది. 

Also Read: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

mumbai | metro-station | latest-telugu-news | telugu-news | rain-alert

Advertisment
Advertisment
తాజా కథనాలు