Air India: ముంబయ్ నుంచి లండన్ విమానం..మూడు గంటలు గాల్లోనే..వెనక్కి..

నిన్న అహ్మదాబాద్...ఇవాళ ముంబయ్. నిన్న జరిగిన ప్రమాదం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇవాళ ముంబై నుంచి బయలుదేరిన ఫ్లైట్ భయపెట్టింది. లండన్ వెళ్ళాల్సి విమానం మూడు డంటలపాటూ గాల్లోనే తిరిగి ముంబైకే వెనక్కు వచ్చేసింది.

author-image
By Manogna alamuru
New Update
Air India

ఏమైందో తెలియదు..ఈరోజు తెల్లవారు ఝామున 5.39 గంటలకు ఎయిరిండియా ఏఐసీ129 విమానం ముంబై నుంచి లండన్ కు బయలుదేరింది. మూడు గంటలపాటూ గాల్లోనే తిరిగింది. మళ్ళీ తిరిగి వెనక్కు ముంబైకే వచ్చేసింది. విమానాన్ని మళ్ళించడానికి కారణాలు ఏంటో మాత్రం తెలియలేదు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. దీని కారణంగా గగనతలాలపై ఆంక్షలు విధించారు. ప్రపంచ వ్యాప్తంగా విమానాలు దారి మళ్ళిస్తున్నాయి. మరికొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై, లండన్ విమానం కూడా ఈ కారణం వల్లనే మూడు గంటలపాటూ తిరిగి తిరిగి వెనక్కు వచ్చిందని అంటున్నారు. 

అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. బయలు దేరిన కొద్దిసేపటికే కూలిపోయిన ఫ్లైట్ తరువాత మంటల్లో దగ్ధం అయిపోయింది. ప్రయాణికులు 229 మందితో పాటూ ఇద్దరు పైలెట్లు, సహాయ సిబ్బంది 12 మంది మొత్తం అందరూ చనిపోయారు. అలాగే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో అక్కడి విద్యార్థులు 24 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయింది.  

Advertisment
తాజా కథనాలు