/rtv/media/media_files/2025/05/20/cxfKzFgvEUXVOhLohSfS.jpg)
Tapan Deka
Tapan Deka: పహల్గాం దాడి, అపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ పదవీకాలన్ని పొడిగిస్తూ ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా, ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ పొడిగిస్తు్న్నట్లు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్ అధికారి. ఆయన 2022లో రెండు సంవత్సరాల కాలానికి గాను ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమితులయ్యారు. అయితే ఆ తర్వాత 2023లో ఆయన పదవీకాలాన్నీ పొడిగించారు. అది ఈ ఏడాది జూన్ 30న ముగియనుంది. ఇదిలా ఉండగానే ఆయన పదవీకాలాన్నీ మరో ఏడాది పొడిగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపింది.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
కాగా భారతదేశ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో డేకాకు విశేషానుభవం ఉంది. టెర్రరిస్టు నెట్‌వర్క్‌లు, తిరుగుబాటు గ్రూపులను టార్గెట్ చేయడంతో పాటు పలు ఆపరేషన్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2008 ముంబై ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్‌కు బాధ్యత వహించారు. ప్రస్తుతం దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సేవలు దేశానికి అవసరం అన్న కోణంలో మరో ఏడాది ఆయన పదవీకాలన్ని పొడిగించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు