Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం

ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

New Update
Heavy Rains: ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌!

ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో  నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆగకుండా చాలాసేపు వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దంచుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించినా..భారీ వర్షంతో పాట్లు మాత్రం తప్పలేదు. ఆకస్మిక వర్షంతో ముంబైలోని పోవై జలమయం అయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనదారులు వేరే దారులు వెతుక్కోవలసి వచ్చింది. రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కొంకణ్గోవా మార్గంలో కూడ భారీ బండరాయ పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలకు వెళ్ళే రైళ్ళకు అంతరాయం కలిగింది. 

మరోవైపు మహారాష్ట్రకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. మరో నాలుగు రోజులు ఇలాగే భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కర్ణాటక తీరం వెంబడి తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా బుధవారం- శనివారం మధ్యలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. 

ముంబై-ఢిల్లీ మ్యాచ్ డౌటే..

ఈరోజు ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆరెంజ్ అలెర్ట్ కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీకి ఇది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ముంబై గెలిచినా లేదా వానపడి చెరో పాయింట్ పంచినా కూడా ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు వెళిపోతుంది. ఢిల్లీ ఆట ఇక్కడితో ముగిసిపోతుంది. ఈ కారణంగానే ఢీసీ ఫ్రాంచైజీ యజమాని మ్యాచ్ ప్లైస్ ను మార్చాలని బీసీసీఐను కోరారు. అయితే దానికి బీసీసీఐ నిరాకరించినట్టు తెలుస్తోంది. 

today-latest-news-in-telugu | mumbai | rains | weather | orange-alert 

Also Read: Cinema: మరోసారి థియేటర్లలోకి మాయాబజార్..ఎన్టీయార్ వర్థంతి రోజు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు