COVID cases in India : ఇండియాలో జేఎన్ 1 వేరియంట్ విజృంభణ.. ఎన్నికేసులు నమోదయ్యాయంటే?

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రూపంలో కోరలు చాస్తోంది. మళ్లీ ప్రపంచమంతా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు పెరుగుతుండగా తాజాగా ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి.

New Update
covid cases in india

covid cases in india

COVID cases in India : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రూపంలో కోరలు చాస్తోంది. మళ్లీ ప్రపంచమంతా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు పెరుగుతుండగా తాజాగా ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ముంబయి, చెన్నై, పుణే, అహ్మదాబాద్ లల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువవుతుండగా.. ఇతర ప్రాంతాల్లోనూ వ్యాధి లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, పలు రాష్ర్టాల్లో కేసుల  సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

Also read: Turkey: పాకిస్తాన్‌కి బాంబులు, ఇండియాకేమో స్వీట్లు.. టర్కీ తీరుపై చర్చ


ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ కరోనాకు సంబంధించిన  జేఎన్ 1 వేరియంట్ రకానికి చెందినవని వైద్యలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్"గా ప్రకటించింది. అయితే 2023 డిసెంబర్ లో JN.1 స్ట్రెయిన్‌కి సంబంధించిన కొత్త ఉపవేరియంట్లు LF.7, NB 1.5 ప్రధానంగా గుర్తించారు. ప్రస్తుతం ఇవే అందరినీ ఇబ్బంది పెడుతున్నాయని తెలుపుతున్నారు.

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
 
మహారాష్ట్ర స్టేట్‌ముంబై నగరంలో 95 కొవిడ్‌19 కేసులు నమోదు అయ్యాయి. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఈ నెలలోనే గణనీయంగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు16 మంది ఉన్నారు.  దాంతో పాటు ఇన్‌ఫ్లూయెంజా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!


ఇక పుణేలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఏమీ లేవు. కానీ ముందస్తు జాగ్రత్తగా  కరోనా బాధితుల కోసం అక్కడి నాయుడు ఆస్పత్రిలో 50 పడకలను సిద్ధం చేసింది. కాగా ఈ నెలలో మంజరికి చెందిన ఒకే ఒక్క వ్యక్తికి కరోనా సోకిందని..87 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్లు చికిత్స కూడా పొందినట్లు పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధిపతి డాక్టర్ నీనా బోరాడే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం కేసులు ఏం లేవని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?

ఇక తమిళనాడులోని పుదుచ్చేరిలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ఆస్పత్రులు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కర్ణాటకలో 16 కొత్త కొవిడ్-19 కేసులు నిర్దారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒకే రోజు 7 కొత్త కేసులు నమోదు అయ్యాయి.  వైరస్‌ విజృంభించి కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మరణాలు ఏం లేవని, కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. 

Also read: Amith sha: చరిత్రలో తొలి విజయం.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు