🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఐపీఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఐడెన్ మార్క్రామ్ (61) పరుగులతో రాణించారు.
ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే లక్నో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది.
పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది.
గుజరాత్ టైటాన్స్ ఈరోజు అదరగొట్టింది. ఢిల్లీని చిత్తు చేసి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్ళిపోయింది. ఇప్పటికే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ నాకౌట్ బెర్త్ లను ఖరారు చేసుకుంది. ఈరోజు ఢిల్లీ మీద గుజరాత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 224 ఇన్నింగ్స్‌ల్లోనే 8వేల పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా అవతరించాడు. ఇంతకు ముందు కోహ్లీ 243 మ్యాచ్‌ల్లో 8 వేల రన్స్ చేశాడు. ఇక GTతో మ్యాచ్ లో (122*) రాహుల్ సెంచరీతో చెలరేగాడు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. పునర్వభైవం కోసం ప్రయత్నాలు చేస్తున్న మేనేజ్మెంట్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంచుకుంది. రెండేళ్లుగా టెస్టులకు దూరమైన ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ సారథిగా ఎన్నికయ్యాడు.