/rtv/media/media_files/2025/05/19/gDJJiQictXegtezeglLY.jpg)
DC VS GT
ఐపీఎల్ 18 సీజన్ లో భాగంగా ఈరోజు ఢిల్లీ, గుజరాత్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడి ఢిల్లీ బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలోనే అది కూడా ఒక్క వికెట్ కూడా పోకుండా సునాయాసంగా ఛేదించేసింది. తమను ఓడించే వారు ఎవరు లేరంటూ విజయ దుందుభి మోగించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లుతో 108 పరుగులు, శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 పరుగులు చేసి చెలరేగిపోయారు.
Also Read : అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు భయంకరమైన క్యాన్సర్
రాహుల్ రికార్డ్..
ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 224 ఇన్నింగ్స్‌ల్లోనే 8వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ప్లేయర్‌గా అవతరించాడు. ఇంతకు ముందు కోహ్లీ 243 మ్యాచ్‌ల్లో 8 వేల రన్స్ చేశాడు. ఈ మేరకు ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 112 నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఇక మొత్తంగా టీ20ల్లో వేగంగా 8 వేల పరుగులు చేసిన జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ (218) రెండో స్థానంలో కొనసాగుతుండగా కేఎల్ రాహుల్ 3, కోహ్లీ 4, పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (244) 5వ స్థానంలో కొనసాగుతున్నారు.
Also Read : హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
మరోవైపు ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళే ఛాన్సెస్ కష్టమయ్యాయి. ఇప్పటికే మూడు జట్లు నాకౌట్ కు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నాలుగో స్థానం కోసం ముంబయ్, ఢిల్లీ, లక్నో లు పోటీ పడాలి. సోమవారం హైదరాబాద్‌తో లఖ్‌నవూ తలపడనుంది. ఇందులో ఓడితే మాత్రం ఇంటిముఖం పట్టినట్టే. ఇక మే 21న ముంబయి, దిల్లీ మ్యాచ్ ఫలితంతో నాలుగో స్థానం ఖరారు అయ్యే అవకాశం ఉంది.
today-latest-news-in-telugu | GT vs DC IPL 2025 | match
Also Read: జ్యోతిపై పూరీ యూట్యూబర్ సంచలన కామెంట్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
Also Read : లష్కరే తోయిబా కీలక కమాండర్ హతం