/rtv/media/media_files/2025/05/18/Z95t5YGnnOjk1vP5ZevJ.jpg)
klr Photograph: (klr )
KL Rahul: ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 224 ఇన్నింగ్స్‌ల్లోనే 8వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ప్లేయర్‌గా అవతరించాడు. ఇంతకు ముందు కోహ్లీ 243 మ్యాచ్‌ల్లో 8 వేల రన్స్ చేశాడు. ఈ మేరకు ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 112 నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది.
ఇక మొత్తంగా టీ20ల్లో వేగంగా 8 వేల పరుగులు చేసిన జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ (218) రెండో స్థానంలో కొనసాగుతుండగా కేఎల్ రాహుల్ 3, కోహ్లీ 4, పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (244) 5వ స్థానంలో కొనసాగుతున్నారు.
kl-rahul | record | telugu-news | today telugu news