/rtv/media/media_files/2025/05/19/xkiZdXm1hxZ5HuzfE6l9.jpg)
ఐపీఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఐడెన్ మార్క్రామ్ (61) పరుగులతో రాణించగా.. నికోలస్ పూరన్ (45) మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టకున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) మరోసారి విఫలమయ్యాడు. ఆయుష్ బడోని(3), అబ్దుల్ సమద్(3), శార్దుల్ ఠాకూర్(4) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబె, నితీశ్ రెడ్డి, కమిన్స్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కీలకం కానుంది.ఇందులో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది. లక్నో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించింది. లక్నో ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవడంతోపాటు ఢిల్లీ, ముంబయి తమ మ్యాచ్‌ల్లో ఓడాలి.
Pant ki kismat kharab hai ya Technique??#IPL2025 #LSGvsSRH #SRHvsLSG @LucknowIPL
— Ritikaa (@ritikuuuu) May 19, 2025
pic.twitter.com/KR1YXFYnxl
srh-vs-lsg | aiden-markram | mitchell-marsh | IPL 2025