/rtv/media/media_files/2025/05/18/WsVT1lXPT7glekwTqHVR.jpg)
West Indies Test captain Roston Chase appointed
West Indies: వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. పునర్వభైవం కోసం ప్రయత్నాలు చేస్తున్న మేనేజ్‌మెంట్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంచుకుంది. రెండేళ్లుగా టెస్టులకు దూరమైన ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ సారథిగా ఎన్నికయ్యాడు.
ఈ మేరకు 33 ఏళ్ల రోస్టన్ చేజ్ 2023లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. టీ 20, వన్డేలపై ఫోకస్ పెట్టిన చేజ్.. సుదీర్ఘ ఫార్మట్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అతన్ని టెస్టులకు సెలక్ట్ చేయలేదు. అయితే వెస్టిండీస్ బోర్డు కెప్టెన్సీ కోసం చేసిన ప్రయోగంతో అతనికి ఊహించని అవకాశం వచ్చింది. బ్రాత్‌వైట్ ఇటీవలే కెప్టెన్సీ వదులుకోవడంతో ప్రత్యేక కసరత్తులు చేసి ఆరుగురిని ఎంపిక చేసింది. వారిలో రోస్టన్ చేజ్, జాన్ క్యాంప్‌బెల్, టెవిన్ ఇమ్లాచ్, జాషువా డాసిల్వా, జస్టిన్ గ్రేవ్స్, వారికన్ ఉన్నారు.
అయితే ఈ ఆరుగురిలో మానసిక ధైర్యం, వ్యక్తిత్వం, కెప్టెన్సీ లక్షణాలను గమనించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీంతో ఈ పరీక్షల్లో చేజ్ ఆకట్టుకోగా అతన్ని కెప్టెన్ గా ఎంచుకుంది. జూన్ లో సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌తో చేజ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 49 టెస్టులు ఆడిన చేజ్.. 5 సెంచరీలతో 2265 పరుగులు చేశాడు. 85 వికెట్లు కూడా పడగొట్టాడు.