BCCI: పాక్‌తో క్రికెట్‌ ఆడేది లేదు.. తేల్చిచెప్పిన బీసీసీఐ

పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది.

New Update
BCCI to pull out of Asia Cup, decides to isolate Pakistan cricket

BCCI to pull out of Asia Cup, decides to isolate Pakistan cricket

పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ ఎఫెక్ట్‌ వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూన్‌లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి కూడా వెళ్లిపోవాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. 

Also Read: పహల్గాంకు జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

BCCI Big Shock To Pakistan

అయితే ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ మండలికి పాక్‌ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. '' పాక్‌ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీకి భారత జట్టు ఆడదు. ఇది మా దేశ సెంటిమెంట్‌. అందుకోసమే మహిళల ఎమర్జింగ్ టీమ్స్‌ కూడా ఆసియా కప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి సమాచారం అందించాం. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేము నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని'' వివరించారు. 

Also Read: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాక్‌ను ఏకాకి చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లకు కూడా స్పాన్సర్లలో ఎక్కువ మంది ఇండియా వారే ఉన్నారు. భారత్-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ లేకుండా ఆసియా కప్ జరిగితే దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు కూడా ఆసక్తి చూపించవు. దీంతో టీమిండియా లేకుండా ఆసియా కప్‌ టోర్నీని జరపడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించవచ్చని బీసీసీఐ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read :  మాయలేడి జ్యోతి.. పాక్‌ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం

 

Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

 telugu-news | rtv-news | bcci | pakistan | india-pakistan

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు