Asia Cup: పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్‌ నుంచి భారత్‌ ఔట్

పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

New Update
Asia Cup

Asia Cup

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

టీమిండియా లేకుండా టోర్నీ..

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాక్‌ను ఏకాకి చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లకు కూడా స్పాన్సర్లలో ఎక్కువ మంది ఇండియా వారే ఉన్నారు. భారత్-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ లేకుండా ఆసియా కప్ జరిగితే దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు కూడా ఆసక్తి చూపించవు. దీంతో టీమిండియా లేకుండా ఆసియా కప్‌ టోర్నీని జరపడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించవచ్చని బీసీసీఐ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

 

asia-cup | pahalgam

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు