/rtv/media/media_files/2025/05/20/pG8Z1qQjUQSjTFZk3uAR.jpg)
SRH VS LSG
ఆడాల్సిన టైమ్ లో ఆడకపోయిన నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఎస్ ఆర్హెచ్ అదరగొట్టింది. లక్నోపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్...లక్నో ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో మొదటి బ్యాటింగ్ కు దిగిన ఎల్ఎస్జీ 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 59, క్లాసెన్ 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 47 పరుగులు చేసి చెలరేగడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేయడం విశేషం. వీళ్ళ తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా 28 బంతుల్లో 35 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన కమిందు మెండిస్ 21 బంతుల్లో 32 కొట్టి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. క్లాసెన్, మెండిస్ జంట నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 55 పరుగులు జోడించింది. మొత్తానికి లక్నో బౌలర్లు ఎంత కష్టపడినా సన్ రైజర్స్ బ్యాటర్లను మాత్రం నిలువరించలేకపోయారు. ఇదే ఆట మొదటి నుంచి ఆడి ఉంటే బావుండేది కదా అనిపించారు హైదరాబాద్ బ్యాటర్లు.
Also Read : సరదాగా ప్రాణం తీసేశారు.. యువకుడి మలద్వారంలో వాటర్ పైపు పెట్టి ఫ్రెండ్స్ ఏం చేశారంటే!
Also Read : పాక్ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్!
ఎల్ఎస్జీ బ్యాటర్లూ చితక్కొట్టారు..
ఐపీఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఐడెన్ మార్క్రామ్ (61) పరుగులతో రాణించగా.. నికోలస్ పూరన్ (45) మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టకున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) మరోసారి విఫలమయ్యాడు. ఆయుష్ బడోని(3), అబ్దుల్ సమద్(3), శార్దుల్ ఠాకూర్(4) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబె, నితీశ్ రెడ్డి, కమిన్స్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కీలకం. లక్నో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించింది.
today-latest-news-in-telugu | srh-vs-lsg | IPL 2025 | match
Also Read: HYD: పొడవకుండా రక్త పరీక్ష...నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం
Also Read : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు మాయం!