రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిగాచీ ఫ్యాక్టరీ పేలుడుపై కమిటీ దర్యాప్తు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంపై నెలరోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.