Kolkata Rape Case: కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుడి శరీరంపై లవ్ బైట్స్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

కోల్‌కతాలో 24 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా శరీరంపై లవ్ బైట్స్ ఉన్నట్లు తన తరఫున వాదించే న్యాయవాది తెలిపారు.

New Update
kolkata

kolkata Rape case

కోల్‌కతాలో 24 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా శరీరంపై లవ్ బైట్స్ ఉన్నట్లు తన తరఫున వాదించే న్యాయవాది తెలిపారు. అతని శరీరంపై గోళ్లు గాట్లు, గీతలు ఉన్నాయని, ముఖ్యంగా మెడ ప్రాంతంలో ఉన్నాయని అన్నారు. అవి ఏంటని అడిగితే మనోజిత్ లవ్ బైట్స్ అని చెప్పాడని తన న్యాయవాది వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

నిందితుడు తరఫున న్యాయవాది..

కానీ ఇంతలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని న్యాయవాది తెలిపారు. అయితే బాధితురాలి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్‌కు పంపాలని, ఆ కాల్ రికార్డ్‌ను కోర్టు ముందు హాజరు పరచాలని మనోజిత్ మిశ్రా న్యాయవాది గంగూలీ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక అత్యాచారం కాదని భావిస్తున్నాను.. జూలై 20వ తేదీకి ఏంటనే విషయం చెప్పగలనని న్యాయవాది తెలిపారు. 

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

ఇదిలా ఉండగా జూన్ 25న సౌత్ కలకత్తా లా కాలేజీ ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గదిలో సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మొదట వారు ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, అతని సహ నిందితులు, లా కాలేజీ విద్యార్థులు అయిన జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలను అరెస్టు చేశారు. తరువాత కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకి బంద్యోపాధ్యాయను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ వైద్య పరీక్షలో మనోజిత్ శరీరంపై మేకులతో చేసిన గాయాలు గతంలో తెలిశాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు