అమెరికా నుంచి 3 అపాచీ హెలికాప్టర్లు.. ఎందుకో తెలుసా?

భారత రక్షణ రంగంలోకి పవర్‌ఫుల్ హెలికాఫ్టర్లు వచ్చి చేరనున్నారు. అమెరికా నుంచి మూడు అపాచీ చాపర్లు జూలై నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. 2020లో 600 మిలియన్ల డాలర్ల ఒప్పందం కింద ఆరు అపాచీలను భారతదేశం ఆర్డర్ చేసింది.

New Update
apache ah-64e attack helicopters

భారత రక్షణ రంగంలోకి పవర్‌ఫుల్ హెలికాఫ్టర్లు వచ్చి చేరనున్నారు. అమెరికా నుంచి మూడు అపాచీ చాపర్లు జూలై నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. 2020లో 600 మిలియన్ల డాలర్ల ఒప్పందం కింద ఆరు అపాచీలను భారతదేశం ఆర్డర్ చేసింది. అమెరికా అపాచీ హెలికాప్టర్ డెలివరీ 15 నెలలకు పైగా ఆలస్యం అయ్యింది.

ఇండియన్ ఆర్మీ మే,-జూన్ 2024 నాటికి ఆరు అపాచీ హెలికాప్టర్లను డెలివరీ చేయాలని అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, డెలివరీ చేయడంలో లేట్ అయ్యింది. గడువును డిసెంబర్ 2024కి మార్చారు. అయినా అపాచీ హెలికాప్టర్లు అమెరికా సరఫరా చేయలేదు. ఈ నెలాఖరులో మొదటి బ్యాచ్‌గా 3 అపాచీ హెలికాఫ్టర్లు పంపిస్తామని మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ తాజాగా తెలిపింది.

Advertisment
తాజా కథనాలు