/rtv/media/media_files/2025/07/02/nara-lokesh-ram-chandra-rao-2025-07-02-18-55-33.jpg)
ఏపీ టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావుకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ నిన్న నారా లోకేష్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. శాసనమండలి సభ్యులుగా పనిచేసిన ఇద్దరూ చట్టసభలో తమగళాన్ని బలంగా వినిపించారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. https://t.co/1K41Soz7gV
— N Ramchander Rao (@N_RamchanderRao) July 2, 2025
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యలపై పోరాడిన అనుభవం గల ఇద్దరు నేతలు తెలుగుజాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. నారా లోకేష్ పోస్ట్ కు స్పందించిన రామచంద్రరావు.. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.