/rtv/media/media_files/2025/07/02/pashamilaram-incident-2025-07-02-19-47-41.jpg)
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి. ప్రతాప్‌కుమార్, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్ ఘుగే ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఫ్యాక్టరీలో సేఫ్టీ నిబంధనలు పాటించారా అనే అంశాలను కమిటీ దర్యాప్తు చేయనుంది.
ప్రమాదంపై నెలరోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. సిగాచి పరిశ్రమ వద్దకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఆ కంపెనీ ప్రతినిధులు వెళ్లారు. ఘటనాస్థలం నుంచి శిథిలాల తరలింపు ప్రారంభమైంది. భవిష్యత్తులో రసాయన కర్మాగారాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీకి డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారం అందించాలని ఆదేశించింది.