BIG BREAKING: చేసేదంతా ఆ ముగ్గురే.. రాజాసింగ్ ఫోన్ కాల్ లీక్!

బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారన్నారు

New Update

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ కు సంబంధించిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. భువనగిరికి చెందిన ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. ఇందుకు స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నామినేషన్ వేయనున్నట్లు తెలుసుకున్న రాజాసింగ్ రెండ్రోజుల క్రితం పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఈ క్రమంలో తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెవీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

అంతటితో ఆగకుండా కిషన్ రెడ్డికి తన ఎమ్మెల్యే రాజీనామా పత్రం కూడా అందించారు. దీంతో రాజాసింగ్ ఎపిసోడ్ బీజేపీతో పాటు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన శివసేన వైపు చూస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పటివరకు బీజేపీ హైకమాండ్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలవరూ ఈ అంశంపై స్పందించలేదు.
ఇది కూడా చదవండి:MLA Anirudh Reddy: తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Also Read :  మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

బీజేపీ వ్యూహం ఇదే..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసే వారకు రాజాసింగ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన రాజానామాను ఆమోదిస్తే.. పార్టీపై విమర్శల డోస్ పెంచే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది జూబ్లిహిల్స్ బై ఎలక్షన్లతో పాటు త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లోనూ నష్టం చేస్తుందని వారు అంచనా వేస్తున్నట్లు సమాచారం. 

Also Read :  అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

bjp Raja Singh | telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
తాజా కథనాలు