ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి 25 మంది!
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
పాకిస్తాన్లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.
ఉత్తరప్రదేశ్లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్ అనే యువకుడిని ఊరి చివరకు తీసుకెళ్లి అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. ఆపై బావిలో పడేశారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతిచెందాడు. బ్రెయిన్ హ్యామరేజ్కి చికిత్స తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతన్ని 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
పిల్లవాడు రాత్రిపూట కడుపు నొప్పి కారణంగా రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటే దీనికి కారణం కడుపులో పురుగులు కావచ్చు. ఈ సమస్య తగ్గాలంటే వెల్లుల్లి, బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి, పసుపు, సెలెరీ, కొబ్బరి నీరు కాకరకాయలో కడుపులో నులిపురుగులను చంపే అంశాలు ఉంటాయి.
రాజస్థాన్లో 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. డీగ్ జిల్లాలోని భాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ASI) చేపట్టిన తవ్వకాల్లో ఇవి వెలుగుచూశాయి. మౌర్యా, శుంగా రాజవంశీయుల కాలం నాటి వస్తువులు, ఆయుధాలు బయటపడ్డాయి.
వాతావరణ మార్పుల సమయంలో జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు నొప్పి, చికాకు, వాపు వంటి సమస్యలు సర్వసాధారణం. ఇవి తగ్గాలంటే ఉప్పు, పసుపు, తేనె, అల్లం, తులసి గొంతులో కఫం, వాపును తగ్గించడంలో ఆవిరి పీల్చడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
మీరు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లాలంటే www.bb9.jiostar.com అనే వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత బిగ్ బాస్9లోకి ఎందుకు పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటని చెబుతూ ఓ వీడియోను అప్లోడ్ చేస్తే చాలు. మీరు ఈ సీజన్లో ఒక హౌస్ మేట్ అయ్యే అవకాశం వస్తుంది.