Plane Crash: మరో ఘోరం.. విమానం కూలి నలుగురు దుర్మరణం

రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.

New Update
Yakovlev Yak-18T aircraft

Yakovlev Yak-18T aircraft

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరువక ముందే పలు విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. రష్యాలోని మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న వారందరూ మరణించారు. 

Russia Plane Crash

సమాచారం ప్రకారం.. ఇది ఒక ట్రైనీ విమానం. ఇది నాలుగు సీట్లు కలిగిన, సింగిల్ ఇంజిన్ తేలికపాటి విమానం. దీంతో నలుగురు మాత్రమే ఉండగా.. అందరూ మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా యాకోవ్లెవ్ యాక్-18T విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయి. ఈ విమానం పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు