/rtv/media/media_files/2025/01/30/FR1bsUm7CcWZOQF1nCoS.jpg)
deepseek in india Photograph: (deepseek in india)
DeepSeek AI: భారతదేశం సొంత ఏఐ మోడల్ లాంట్ చేయాలని ఆలోచిస్తోందని సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్(Central IT Minister Ashwini Vaishnaw) అన్నారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. సెక్యురీటి దృష్యా చైనా డీప్‌సీక్(DeepSeek) త్వరలో ఇండియా సర్వర్‌లో హోస్ట్ చేస్తామని గురువారం ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అవశ్యకతను వివరిస్తూ కొన్ని నెలల టైంలోనే ఇండియా సొంత ఏఐ మోడల్ తయారు చేసుకుంటుందని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇందుకోసం ఉమ్మడి కంప్యూటింగ్ కింద 18,693 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల ఎంప్యానెల్‌మెంట్‌ను మంత్రి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!
త్వరలోనే ఇండియలో AI సేఫ్టీ సెంటర్..
భారతదేశాన్ని గ్లోబల్ AI సెంటర్ స్టేజ్‌లో ఉంచుతామని హామి ఇచ్చారు. త్వరలోనే ఇండియలో AI సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాని మోదీ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రభుత్వం మార్చిలో రూ.10,300 కోట్లకు పైగా AI పెట్టుబడిని ప్రకటించింది. దీనిని IndiaAI మిషన్ అని పిలుస్తారు. ఇందులో AI స్టార్టప్‌లకు ఫండింగ్, AI మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!