Suryapet Murder: చంపింది నాయనమ్మే .. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

సూర్యాపేట పరువు హత్య కేసులో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అన్నయ్యను రెచ్చగొట్టి తన నానమ్మే కృష్ణను హత్య చేయించినట్లు తెలిపింది. అంతేకాదు హత్య తర్వాత తనభర్త ప్రైవేట్‌ పార్ట్స్‌ను నాన్నమ్మ కసితీరా తొక్కినట్లు వాపోయింది

New Update

Suryapet Murder: సూర్యాపేట కృష్ణ అలియాస్‌ మాలబంటి హత్య కేసులో భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అంతా తన నాన్నమ్మనే చేయించినట్లు తెలిపింది.  "నాన్నమ్మకు విపరీతమైన కుల పిచ్చి ఉంది. కులం తక్కువ వాడిని చేసుకున్నానని నన్ను చాలా సార్లు కొట్టింది. మా అన్నయ్యను నాన్నమ్మే రెచ్చగొట్టి హత్య చేసేలా చేసింది. నానమ్మ కళ్ళలో ఆనందం చూడడానికి మా అన్నయ్య కృష్ణను చంపేశాడు. హత్య తర్వాత నాన్నమ్మకు డెడ్ బాడీ చూపించి సంతృప్తి పరిచారు. బంటి ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి మా నాన్నమ్మ కోపం చల్లార్చుకుంది. నా భర్త హత్యకు కారణమైన మా అన్నయ్య, నాన్నమ్మకు ఉరిశిక్ష వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది భార్గవి. " మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం  ఇష్టంలేని భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ కోపంతో రగిలిపోయింది. కృష్ణనను చంపేయమని తన కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టి పరోక్షంగా హత్యకు కారణమైంది. 

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

రాత్రంతా కారు డిక్కీలోనే 

ఆదివారం రాత్రి 9 గంటలకు కృష్ణను హత్య చేసిన నిందితులు రాత్రంతా శవాన్ని కారు డిక్కీలోనే పెట్టుకొని తిరిగారు. ముందుగా నల్గొండ పరిసరాల్లోనే శవాన్ని వదిలేయాలని భావించారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యపేటకు తీసుకొచ్చారు. చివరిగా పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై కృష్ణ డెడ్ బాడీని పడేసి పరారయ్యారు. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని నవీన్ రెండు నెలల నుంచే  కృష్ణను హత్యకు ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్‌, నల్గొండకు చెందిన మరో యువకుడి సహాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే మహేష్ కృష్ణతో స్నేహంగా నటించాడు. అలా కృష్ణను ట్రాప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు