Ambati Rambabu: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్!

వైసీపీ నేతలకు దిమాక్ ఖరాబ్ అయిందంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాకు దిమాక్ లేదు. కానీ మీకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు. నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చండి' అన్నారు.

New Update
ambati

Ambati Rambabu, Pemmasani Chandrasekhar

Ambati Rambabu: మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ(YCP) వాళ్లకు దిమాక్ లేదంటూ పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో కేంద్రమంత్రి కామెంట్స్ పై తాజాగా తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన అంబటి రాంబాబు.. తమ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను ఎందుకు డబ్బులు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ప్రశ్నించారు. నిజంగానే దిమాక్ లేదనుకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి.. 

గురువారం గుంటూర్ మీడియాతో మాట్లాడిన అంబటి.. 'మాకు దిమాక్ లేదని పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడటం చూశాను. అవును మాకు దిమాక్ లేదు అనుకుందాం.. మీకు ఉంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు. మీకు దిమాల్ ఉంటే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టండి.

Also Read: AP Metro Rail Update: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లపై గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

మీకు దిమాక్ ఉంటే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి. మేయర్ ను దించే హక్కు కూటమి నేతలకు లేదు. అది ప్రజలు ఇచ్చే అవకాశం. ఇంతకు మీ సూపర్ సిక్స్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ సూపర్ అట్టర్ ప్లాప్ అయింది. అందుకే మా మీదపడుతున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:  జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు