Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో విడుదలైన యాక్షన్ ఎంటర్ టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. తెలుగులో ప్లాప్ ఆయిన ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ చేయగా.. 100 మిలియన్లకుపైగా వ్యూస్‌ దక్కించుకుంది.

New Update

హిందీలో వెర్షన్ 

అయితే తెలుగులో ప్లాప్ అయిన ఈ సినిమా.. హిందీలో దుమ్మురేపుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ ను యూట్యూబ్ లో విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.  RKD Studios యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేయగా.. 100 మిలియన్లకుపైగా వ్యూస్‌ దక్కించుకుంది. అలాగే 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించి ఫెయిల్యూర్‌తో నిరాశలో మునిగిపోయిన చిత్రబృందానికి ఇది మంచి విషయమే అని చెప్పాలి. పూరి జగన్నాథ్- ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిధి కావ్య థాపర్ ఫీమేల్ లీడ్ గా నటించింది. సంజయ్‌ దత్‌ విలన్‌గా నటించగా.. అలీ, గెటప్‌ శ్రీను, షాయాజీ షిండే  తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం రామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మూవీ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో 'రాపో 22' సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇందులో భాగ్య శ్రీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో హీరో రామ్ లుక్  గత సినిమాల్లో లేని విధంగా చాల డిఫెరెంట్ గా ఉండబోతుందని ప్రీ లుక్ చూస్తే అర్థమవుతుంది. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు