/rtv/media/media_files/2025/01/30/o67mXez0IVXozdug5oLt.jpg)
monalisa movie offer
Sanoj Mishra: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ.. తన డస్కీ స్కిన్, తేనెకళ్లతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా.. ఇప్పుడు సినిమాల్లో కనిపించబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన నెక్స్ట్ చిత్రంలో మోనాలిసాను లాంచ్ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తన వాగ్దానం ప్రకారం, తాజాగా సనోజ్ మిశ్రా ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు. ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమ గురించిన సమాచారాన్ని, సందేహాలను స్పష్టం చేశారు. మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్వయంగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోను పోస్ట్ చేశారు.
20 కోట్ల బడ్జెట్‌తో సినిమా
సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తెగా కనిపించనుంది. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 కోట్లు బడ్జెట్‌తో సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాగా.. మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ లో పాల్గొననుంది.
Also Read: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇప్పటికీ 12 చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో గాంధీ గిరీ, ది డైరీ ఆఫ్ బెంగాల్, కాశీ టూ కాశ్మీర్, రామ్ కీ జన్మ భూమి వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక 'డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?